నవంబర్ 27, 2026
TRINETHRAM NEWS
Excise Department

Excise Department : త్రినేత్రం న్యూస్ : నాటుసారా తయారీ, అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హుజూర్‌నగర్ ఎక్సైజ్ సీఐ నంద్యాల శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మట్టంపల్లి, గరిడేపల్లి, మేళ్లచెరువు, పాలకీడు, చింతలపాలెం మండలాల్లో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీఎఫ్, ఎస్టీఎఫ్ బృందాలు సంయుక్త దాడులు నిర్వహించాయి.

దాడుల్లో 35 కిలోల పటిక, 40 కిలోల బెల్లం, 55 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకోగా, 2,900 లీటర్ల పులిసిన బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. అక్రమాలకు సంబంధించి 28 కేసులు నమోదు చేసి 14 మందిని అరెస్ట్ చేయగా, మరో 10 మందిపై బైండోవర్ చర్యలు చేపట్టారు.

నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాల సమాచారం తెలిస్తే ఎక్సైజ్ శాఖకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page