నవంబర్ 27, 2026
TRINETHRAM NEWS
Donation 121 kg Gold

Donation 121 kg Gold : త్రినేత్రం న్యూస్ : తిరుమల శ్రీవారికి 121 కేజీల బంగారాన్ని విరాళంగా అందించిన వర్ధమాన్ జైన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. ఇంతకీ ఆయన ఎవరు? ఆయన వ్యాపార సామ్రాజ్యం ఎంత పెద్దది?

వర్ధమాన్ జైన్ హెల్త్‌కేర్ టెక్నాలజీ, BPO రంగాల్లో విశేష అనుభవం కలిగిన వ్యాపారవేత్త. ఆయన Access Healthcare, Vara Future LLP, Asia Chennai Engineering వంటి సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారు.

అంతేకాకుండా కంచి కామకోటి చైల్డ్స్ ట్రస్ట్ ఆసుపత్రికి మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా విద్య, వైద్య రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2025లో Access Healthcare సంస్థలో తన 70 నుంచి 75 శాతం వాటాను అమెరికాకు చెందిన ఓ కంపెనీకి సుమారు 2 బిలియన్ డాలర్లకు విక్రయించినట్లు సమాచారం.

వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వర్ధమాన్ జైన్.. తాజాగా తిరుమల శ్రీవారికి భారీగా బంగారం సమర్పించడంతో వార్తల్లో నిలిచారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page