
బాల్యవివాహ రహిత భారతదేశ నిర్మాణానికి కృషి చేస్తా.. హరిత అరకు కోసం మొక్కలు నాటుతా
Garividi Lakshmi : అరకులోయ నవంబర్ 27, (త్రినేత్రం న్యూస్): గిరిజన ప్రజల అభ్యున్నతికి, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని పేద గిరిజనుల సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తానని సినీ ప్రముఖురాలు గరివిడి లక్ష్మి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా … అరకు వ్యాలీలోని జీటీడబ్ల్యూ బాలికల పాఠశాలలో నిర్వహించిన బాల్యవివాహాల నిర్మూలన, బాలికల విద్యపై అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి స్వయంగా ఎదగాలని, బాల్యవివాహాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
అలాగే ‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా అరకు ప్రాంతంలో మొక్కలు నాటి హరిత అరకు నిర్మాణానికి కృషి చేస్తానని ప్రకటించారు. ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో విద్యార్థినులు పాటలతో అలరించగా, వారి ప్రతిభను గరివిడి లక్ష్మి అభినందించారు. బాల్యవివాహాలకు దూరంగా ఉంటూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటామని విద్యార్థినులు ప్రతిజ్ఞ చేశారు. వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe