నవంబర్ 26, 2026
TRINETHRAM NEWS
Bandi Ramesh

Bandi Ramesh : కూకట్పల్లి నవంబర్ 26 త్రినేత్రం న్యూస్ : రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు గురువారం నిర్వహించిన “సంవిధాన్ రక్షా మార్చ్” కార్యక్రమంలో బండి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మార్చ్‌ను విజయవంతం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page