నవంబర్ 24, 2026
TRINETHRAM NEWS
Shaik Ismail

— రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం.

—కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరాన్ని ఎండబెడుతున్న రేవంత్ రెడ్డి.

Shaik Ismail : దేవరకొండ డివిజన్ నవంబర్ 24, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రానికి జీవధారగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై రాజకీయ కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని దేవరకొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు షేక్ ఇస్మాయిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించబడిందని, అలాంటి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ కేసీఆర్‌పై ఉన్న రాజకీయ కక్షతో తెలంగాణ రైతుల ప్రయోజనాలను పక్కనపెడుతున్నారని విమర్శించారు.

మేడిగడ్డ బ్యారేజీ నుంచి రోజుకు సుమారు 9 వేల క్యూసెక్కుల నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారని.,, ఒకవైపు తెలంగాణ రైతాంగం సాగునీటి కోసం ఎదురుచూస్తుంటే, మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ పరిసరాల్లో వేలాది లారీలతో ఇసుక దందా కొనసాగుతోందని

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాజకీయ కక్షలు, నిర్లక్ష్య ధోరణి విడనాడి, తెలంగాణ నీటిని తెలంగాణ ప్రజల అవసరాలకు వినియోగించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రాధాన్యత కావాలని, ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు కళ్లు తెరిచి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని షేక్ ఇస్మాయిల్ హితవు పలికారు.

నల్లమల పులి అనే చెప్పుకునే రేవంత్.. పులి తన పిల్లల్ని తానే చంపుక్కన్నట్టు.. ఈ రోజు తెలంగాణా ప్రజలను రేవంత్ చంపుకుంటున్నాడని విమర్శించారు తెలంగాణ నీరు తెలంగాణ రైతులకే దక్కాలి.. రైతాంగ ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు అని ఆయన స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page