
ప్రొఫెసర్ కె. వెంకటేశ్వరరావుపై ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరగాలి
JNTU : కూకట్పల్లి నవంబర్ 20 త్రినేత్రం న్యూస్ : జేఎన్టీయూ హైదరాబాద్ మాజీ రిజిస్ట్రార్, ప్రముఖ నానోటెక్నాలజీ పరిశోధకుడు ప్రొఫెసర్ కె. వెంకటేశ్వరరావు పై వస్తున్న ఆరోపణలు విద్యావర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దశాబ్దాలుగా విద్యా, పరిశోధనా రంగాల్లో సేవలందిస్తూ, వందలాది పరిశోధనా పత్రాలు ప్రచురించి, అనేక మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించిన విద్యావేత్తపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాస్తవాలను నిష్పక్షపాతంగా వెలికితీయాలని పలువురు విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. పేదలకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించిన వ్యక్తిగా ఆయనకు ఉన్న గుర్తింపును కూడా పలువురు ప్రస్తావిస్తున్నారు.
నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత కక్షలు లేదా రాజకీయ ఒత్తిళ్లకు విద్యావ్యవస్థ వేదిక కాకూడదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “రాజకీయ నాయకులారా.. మీ రాజకీయాలు మీకు ఉండవచ్చు, మా పిల్లల భవిష్యత్తుతో మాత్రం ఆడుకోవద్దు” అని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరోపణలు నిజమైతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, నిరూపితం కాని ఆరోపణలతో ఒక విద్యావేత్త గౌరవానికి భంగం కలిగించవద్దని కోరుతున్నారు. జేఎన్టీయూ ప్రతిష్ఠను కాపాడండి.. విద్యావేత్తల గౌరవాన్ని నిలబెట్టండి.. విద్యావ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచండి అని విద్యా వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe