నవంబర్ 20, 2026
TRINETHRAM NEWS
Boddupalli Krishna

–బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ.

Boddupalli Krishna : దేవరకొండ డివిజన్ నవంబర్ 20, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. దేవరకొండ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఎం డి మందిర్ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.శుక్రవారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ……మైనంపల్లి నుంచి దేవరకొండ పట్టణానికి పాఠశాలను మార్చేందుకు ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని అన్నారు.

అనుమతులు లేకుండా పాఠశాలను మార్చి నిర్వహిస్తున్న యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయితే ఎం డి మందిర్ పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయడంతో పాటు, బాధ్యులైన యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page