నవంబర్ 18, 2026
TRINETHRAM NEWS
crime news

4 రోజుల్లోనే కేసు ఛేదన

Crime News : త్రినేత్రం న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసును పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించారు. నకిలీ సీబీఐ అధికారులుగా అవతారమెత్తిన ఓ ముఠా రియల్ ఎస్టేట్ వ్యాపారి సాదిక్‌ను అపహరించి రూ.5 కోట్లు డిమాండ్ చేసింది.

ఈ నెల 10న కారులో వెళ్తున్న సాదిక్‌ను అడ్డుకున్న నిందితులు నకిలీ సీబీఐ గుర్తింపు కార్డులు, వారెంట్ చూపించి కిడ్నాప్ చేశారు. అనంతరం కర్ణాటకలోని తుమకూరు ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి నిర్బంధించారు. రూ.5 కోట్లు ఇవ్వాలని బంధువులపై ఒత్తిడి తెచ్చి, రూ.26 లక్షలను తమ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు.

కేసును సీరియస్‌గా తీసుకున్న మదనపల్లె పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ నెల 14న పీటీఎం చెక్‌పోస్టు వద్ద ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, వ్యాపారి సాదిక్‌ను సురక్షితంగా రక్షించారు. బదిలీ అయిన రూ.26 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు.

నిందితుల నుంచి రెండు నకిలీ సీబీఐ ఐడీ కార్డులు, డమ్మీ పిస్టల్, చేతి సంకెళ్లు, ఇన్నోవా క్రిస్టా కారును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నకిలీ సీబీఐ అధికారుల ముసుగులో కిడ్నాప్‌కు పాల్పడిన ముఠాను పోలీసులు పట్టుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page