నవంబర్ 16, 2026
TRINETHRAM NEWS
Golconda Diamond

Golconda Diamond : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ గోల్కొండ గడ్డకు చెందిన అరుదైన పింక్ వజ్రం అంతర్జాతీయ వేలంలో సంచలనం సృష్టించింది. జెనీవాలో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ అరుదైన ‘బల్గారి పింక్’ వజ్రం ఏకంగా రూ.130 కోట్లకు అమ్ముడైంది.

24 క్యారెట్ల బరువున్న ఈ వజ్రాన్ని 1950లలో కొనుగోలు చేసి, ప్రముఖ బల్గారి సంస్థ ప్రత్యేకంగా ఉంగరంగా రూపొందించింది. దాదాపు 70 ఏళ్లుగా ఒకే కుటుంబం వద్ద ఉన్న ఈ వజ్రాన్ని తొలిసారిగా వేలానికి తీసుకువచ్చారు.

అరుదైన గులాబీ రంగు, అద్భుతమైన నాణ్యత కారణంగా క్రిస్టీస్ సంస్థ దీనిని ‘పింక్ డైమండ్స్‌లో మోనాలిసా’గా అభివర్ణించింది.

ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గోల్కొండ వజ్రాల వైభవం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది!

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page