
– దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
Ramavath Ravindra Kumar : దేవరకొండ / పి ఎ పల్లి నవంబర్ 05, త్రినేత్రం న్యూస్. ప్రతి ఒక్కరూ తుల్జా భవానీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్. ఆకాంక్షించారు.గురువారం పీఏ పల్లి మండలం పాలపట్టి తండాలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ తుల్జా భవానీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని సూచించారు. తుల్జా భవానీ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెల్లుగురి వల్లపు రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రెటీనేని ముత్యపు రావు, సర్పంచులు రైనబోయిన శ్రీను, కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, దూదిపాల రాజేందర్ రెడ్డి, ఆడెపు నగేష్, రమావత్ కిషన్, హన్మ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ అర్వపల్లి నర్సింహ, మునగాల అంజిరెడ్డి, మద సుధాకర్ గౌడ్, బొడ్డుపల్లి మహేందర్, వంగాల కృష్ణారెడ్డి,గోలి గిరి,ఎర్ర యాదగిరి, కర్నాటి రవికుమార్,అనిల్, రవి,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe