అక్టోబర్ 28, 2026
TRINETHRAM NEWS
Graduation Day

–ముఖ్య అతిథిగా దేవరకొండ సబ్ కలెక్టర్ కారోలిన్ చిన్ తీయన్ మావి.

–వేడుకలను విజయవంతం చేయాలి.

— కళాశాల ప్రిన్సిపాల్ డా; రమావత్ రవి.

Graduation Day : దేవరకొండ డివిజన్ అక్టోబర్ 28, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని మునగాల కొండలరావు ఎం కె ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12వ గ్రాడ్యుయేషన్ డే గురువారం నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రామావత్ రవి తెలిపారు. కళాశాల ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు.

ఈ వేడుకలకు దేవరకొండ డివి జన్ సబ్ కలెక్టర్ కరోలిన్ చిన్ తీయన్ మావి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. విశిష్ట అతిథిగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ కొంపెల్లి అంజిరెడ్డి, ప్రత్యేక అతిథిగా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి, పాల్గొననున్నట్లు వివరించారు.
కళాశాల అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు ఈ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమావత్ రవి కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page