అక్టోబర్ 28, 2026
TRINETHRAM NEWS
Awareness Impact of El Nino

Awareness Impact of El Nino : దేవరకొండ డివిజన్ అక్టోబర్ 28/ త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం లోని మైనంపల్లి వద్దగల తెలంగాణ ప్రభుత్వ మహిళా గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో బుధవారం సర్పంచ్ రాంసింగ్ నాయక్ ఆధ్వర్యంలో ఎల్వినో ప్రభావం నివారణ చర్యలు అనే అంశం పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ప్రభావం మరియు నీటి సంరక్షణ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణ సవాలను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు నడుము బిగించాలని నీటిని వృధా చేయకుండా ప్రతి నివాసంలోనూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ శ్రీనివాస రావు, ఎంపీడీవో పార్వతి ఆర్డబ్ల్యూఎస్ డి నగేష్, ఏఈ హుస్సేన్ ఏ ఈ ఓ అభిలాష్ కళాశాల ప్రిన్సిపాల్ హరిప్రియ వార్డు సభ్యులు వెంకట్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page