
Distribution of Blankets : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 28 ; జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మళ్లీనీడి తిరుమలరావు (బాబి) జన్మదిన వేడుకలను వాళ్ల మిత్రబృందం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే జిల్లా కేంద్రమైన భీమవరం సోమేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా పూజలు నిర్వహించారు.
అనంతరం పేదలకు దుప్పట్లు మరియు భోజనాలు పంపిణీ చేశారు. స్నేహశీలి, సేవాతాత్పరుడు ఆయనే. నిత్యం ప్రజల్లో ఉండే మంచి మనిషి అని కొనియాడారు. పుట్టినరోజు వేడుకలను అభిమానులు, శ్రేయోభిలాషులు సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఒక్క కంఫర్టర్.. రెండు అదిరిపోయే కలర్స్! AYKA రివర్సిబుల్ AC కంఫర్టర్.