
Goal Jagan CM Again : అరకులోయ, సెప్టెంబర్ 11, (త్రినేత్రం న్యూస్): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీ డా. కుంభా రవిబాబు పిలుపునిచ్చారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి వైఎస్సార్ కుటుంబం ఎంతో కృషి చేసిందని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. అరకులోయ కాఫీ, మిరియాలు, పసుపు తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మారికవలస గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు.
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను స్థానిక నాయకులు, పార్టీ కమిటీలు సమష్టిగా నిర్ణయించాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, స్థానిక ఎన్నికలను 2029లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసే దిశగా పునాదిగా మార్చాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో ఎంపీ గుమ్మా తనూజరాణి, జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe