సెప్టెంబర్ 11, 2026
TRINETHRAM NEWS
Do Not Halt New Pensions

Do Not Halt New Pensions : డుంబ్రిగూడ, అరకులోయ సెప్టెంబర్ 11,(త్రినేత్రం న్యూస్): అల్లూరి జిల్లాలో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అర్హులైన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, సామాజిక కార్యకర్త సుజాత సల్మాన్ అన్నారు. దరఖాస్తుల గడువులో వరుస సెలవులు రావడంతో అర్హులకు అవకాశం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెన్షన్ దరఖాస్తుల కోసం గంటల తరబడి క్యూలలో వేచి ఉండాల్సి వస్తోందని, మీ-సేవా కేంద్రాల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ లబ్ధిదారులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. దీనిపై అధికారులు విచారణ జరిపి, తప్పులు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెన్షన్ దరఖాస్తుల గడువును పొడిగించి ప్రతి సచివాలయంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, నిరుపేదలకు ఇబ్బందులు లేకుండా అర్హులందరి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సుజాత సల్మాన్ కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page