సెప్టెంబర్ 9, 2026
TRINETHRAM NEWS
Grand Felicitation Mallikarjun

Grand Felicitation Mallikarjun : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 09, త్రినేత్రం న్యూస్. మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), దేవరకొండ లో అలుమ్ని సెక్రెటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రస్తుతం మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నల్గొండలో ఆంగ్ల అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్నా డాక్టర్…
కేతనబోయిన మల్లికార్జున్ ఇటీవల అనురాగ్ యూనివర్సిటీ, హైదరాబాద్ నుంచి ఆంగ్లంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆయన “చిత్రా బెనర్జీ దివాకరుణి ఎంపిక చేసిన నవలల్లో బహుళ సాంస్కృతికత – ఒక అధ్యయనం” అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు.అదేవిధంగా విద్యారంగంలో అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఆయనకు “శిక్షా రత్న అవార్డు” కూడా లభించింది. ఈ రెండు విశిష్ట విజయాలను పురస్కరించుకుని మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), దేవరకొండ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కళాశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రయోజనాలు, విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు ఆయనను అభినందించి, శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి.కోటయ్య అకాడమీ కోఆర్డినేటర్ సి. లింగమయ్య ,సిఓఈ జి. లింగారెడ్డి, ఏసిఓఈ డాక్టర్ ఎం. ప్రభాకర్, డాక్టర్ వి. మకట్లాల్, డాక్టర్ కె .రేణుక తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page