
తెలుగు ఉపాధ్యాయురాలు ఎర్ర వెంకటమ్మ కి ఘనంగా వీడ్కోలు.
టి పి సి సి ఎస్ సి డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ :– డాక్టర్ యేకుల రాజారావు
Retirement Felicitation Meeting : పి ఏ పల్లి సెప్టెంబర్ 03, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా పీ.ఏ.పల్లి మండలం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తెలుగు ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న ఎర్ర వెంకటమ్మ పదవీ విరమణ . గురువారం స్థానిక ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో టి పి సి సి ఎస్ సి డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ ఏకల రాజారావు పాల్గొన్నారు.
ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటమ్మ ఉపాధ్యాయ వృత్తిలో నిబద్ధతతో, అంకితభావంతో పనిచేశారని, ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని తెలుగు భాషపై ఆమెకున్న మక్కువ, విద్యార్థుల పట్ల చూపిన ఆప్యాయత ఎప్పటికీ మరువలేనిదని డాక్టర్ రాజారావు అన్నారు
అనంతరం ఆమెను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి మేమెంటో అందజేశారన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యేకుల సురేష్, మాల మహానాడు కొండమల్లెపల్లి మండల అధ్యక్షులు అన్ని మల్ల సురేష్, చేపూరి మురళి, గ్రామ సర్పంచ్, వివిధ హోదాలో ఉన్న అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe