Trinethram News : కరీంనగర్ జిల్లా : ఫిబ్రవరి 02
కరీంనగర్ లో రోడ్డు ప్రమాదాల నివారణపై కరీంనగర్ పోలీసులు శుక్రవారం దృష్టిసారించారు. ప్రమాదాలు అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి స్కూల్ వాహనాలను పరిశీలిస్తు న్నారు.
స్కూల్ బస్‌లు, ఆటోల ఫిట్నెస్ చెక్ చేయడంతో పాటు ఇన్స్యూరెన్స్ డ్రైవర్ ట్రాక్‌ను చెక్ చేస్తున్నారు. స్కూల్ వాహనాలపై గతంలో ఏమైనా యాక్సి డెంట్ కేసులు నమోదు అయ్యాయా, డ్రైవర్‌పై చరిత్రపై ఆరా తీస్తున్నారు.
అలాగే సదరు వాహనాల పెండింగ్ చలాన్లను పరిశీలి స్తున్నారు. ఇన్స్యూరెన్స్ క్లియర్ చేయని వాహనా లను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదలైన ఈ స్పెషల్ డ్రైవ్ 10 గంటలవరకు కొనసాగింది.
తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు మరోసారి స్పెషల్ డ్రైవ్ ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.