
All India Youth Federation : డిండి (గుండ్ల పల్లి) ఆగష్టు 18, త్రినేత్రం న్యూస్. డిండి మండల సిపిఐ ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన అఖిల భారత యువజన సమాఖ్య ఆఫీస్ బేరర్స్ సమావేశానికి అధ్యక్షత అఖిల భారత యువజన సమాఖ్య డిండి మండల అధ్యక్షులు కాంపల్లి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన
సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత యువజన సమాఖ్య నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎనమల్ల నవీన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం చాలా దుర్మార్గమని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు ఎన్నికల ప్రచారంలో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేసి మతాల పేరుతో యువతను పక్క త్రోవ పట్టిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా యువతకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం ఏఐవైఎఫ్ మండల మహాసభలో ఎజెండాగా చేర్చిన గోనకల్ నుండి డిండి మండలం వరకు రోడ్డు గుంతలుగా ప్రమాదంగా ఏర్పడి ప్రయాణికులకు ప్రమాదాలను పొంచే విధంగా రోడ్డు తయారయింది వెంటనే రోడ్డు మరమ్మతులను చేపట్టాలని లేని పక్షంలో శుక్రవారం ఉదయం గోనకల్ నుండి డిండి మండల పోలీస్ స్టేషన్ వరకు అఖిల భారత యువజన సమాఖ్య( ఏఐవైఎఫ్ ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేపడతామని వారన్నారు.
ఈ సమావేశంలో అఖిల భారత యువజన సమాఖ్య డిండి మండల కార్యదర్శి ఎలిమినేటి నరేష్,ఉపాధ్యక్షులు నూనె భూపాల్,సహాయ కార్యదర్శి నక్క వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe