సెప్టెంబర్ 5, 2026
TRINETHRAM NEWS
Dr. Patanjali Devi

Dr. Patanjali Devi : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం. ఆగస్టు 13. ( త్రినేత్రం న్యూస్). పెనుమూరు. పెనుమూరు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని చిత్తూరు డిసిహెచ్ఎస్ డాక్టర్ పతాంజలి దేవి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లోని పరిసరాలను పరిశీలించారు. తర్వాత పేషెంట్లకు అందుతున్నటువంటి వైద్య సదుపాయాలు గురించి ఆరా తీశారు.

అలాగే వాళ్లకి ఇస్తున్నటువంటి మందులు గురించి ఆరా తీశారు. మందులన్నీ సప్లై ఉన్నాయ లేదా. లేకపోతే తెప్పించి రోగులకు ఇవ్వమన్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న 40 పడకల ఆసుపత్రిని సందర్శించి, తొందరగా నిర్మాణాలు చేపట్టి, పూర్తి చేసి ఇవ్వాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మధులత, సీనియర్ డాక్టర్ శ్రీధర్ బాబు, సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ సయ్యద్ ఇర్షాద్, హెడ్ నర్స్ నిర్మలాదేవి,నర్సింగ్ స్టాప్, డాక్టర్ స్టాప్, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page