ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Agriculture Officer

కందులు పెసలు మినుములు నువ్వులు కొర్రలు ఆముదం, డిండి మండల వ్యవసాయ అధికారి :- రెహానా.

Agriculture Officer : డిండి (గుండ్ల పల్లి) ఆగష్టు 06, త్రినేత్రం న్యూస్. ప్రభుత్వం ఆరుతడి పంటలకు సబ్సిడీపై విత్తనాలను అందజేస్తుందని రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిండి మండల వ్యవసాయ అధికారి రెహానా తెలిపారు.
ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ… నీటి వసతి లేని ప్రాంతాల్లో రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలనీ , కందులు, పెసలు, మినుములు, నువ్వులు, కొర్రలు, ఆముదం, చిరుధాన్యాలు వంటి పంటలను సాగు చేయాలని కోరారు.
ప్రస్తుతం బోర్లలో నీరు అందుబాటులో ఉందని అధిక విస్తీర్ణంలో వరి సాగు చేయకండి. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున, తరువాత నీటి కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు,అందువల్ల పంట మార్పిడిని పాటిస్తూ, వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page