
Udhayanidhi Stalin : త్రినేత్రం న్యూస్ : తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను చెన్నైలోని ఆయన ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌కి వ్యతిరేకంగా తంజావూర్‌లో జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆ తర్వాతే ఈ చర్య తీసుకున్నారు.
ఈ నిరసన సమయంలో మద్దతుదారులు నటి త్రిష పేరును ప్రస్తావించగా, ఆ వెంటనే విజయ్‌కి, ఆ నటికి ఆపాదించేలా లైంగికపరమైన అర్థం వచ్చేలా ఉదయనిధి కామెంట్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై TVK మహిళా వింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా కంప్లయింట్స్ అందాయి. ఉదయనిధిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇవాళ ఆయన్ని అరెస్ట్ చేశారు.
అయితే, పోలీసులు అదుపులోకి తీసుకున్న టైమ్‌లో..ఉదయనిధి తనను తాను సమర్థించుకుంటూ..ముఖ్యమంత్రి మినహా నేను ఎవరి పేరునైనా ప్రస్తావించానా? అని ప్రశ్నించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe