జూలై 25, 2026
TRINETHRAM NEWS
KTR birthday celebrations

-ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇంచార్జీ రమావత్ రవీంద్ర కుమార్.

KTR Birthday Celebrations : దేవరకొండ డివిజన్ జులై 24, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇంచార్జీ శ్రీ రమావత్ రవీంద్ర కుమార్ హాజరై బస్ స్టాండ్ వద్ద కేక్ కట్ చేశారు.అనంతరం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లను, బ్రెడ్ల ను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page