
Car Crashes Dharma House : త్రినేత్రం న్యూస్ :Jul 10, 2026, హైదరాబాద్లోని ఫిలింనగర్లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నటుడు ధర్మ ఇంటి గేటు, ప్రహారీ గోడ ధ్వంసమయ్యాయి. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి నటుడి ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు.
కారులో ప్రయాణిస్తున్న యువకులు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధర్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe