భారతీయ విద్యా కేంద్రం “విజ్ఞాన భారతి ” ఆధ్వర్యంలో 76 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : 76 వ గణతంత్ర దినోత్సవాని పురస్కరించుకుని, అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో గల స్థానిక భారతీయ విద్యా కేంద్రం వారి విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల వారు నిర్వహించిన “ఘోష్” (మార్చిఫాస్ట్) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థిని ,విద్యార్థులు సుండ్రుపుట్టు నుంచి మార్చిఫాస్ట్ చేసుకుంటూ బజార్, ఓల్డ్ బస్టాండ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం, మోదకోదండమ్మ ఓపెన్ ఆడిటోరియంనికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంనికి ముఖ్యఅతిధిగా యుగంధర్ (RSS ప్రాంతకార్యకరిని సభ్యులు) గౌరవ అతిదులుగా కొట్టగుల్లి సింహాచలం నాయుడు (గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ హుకుంపేట), వెంకటరత్నం, పి. రామయ్య, A. V. S. ఆచార్యులు హాజరుకావడం జరిగింది .
యుగంధర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం యొక్క విలువలు నేటితరమైన మీరు కాపడవలసిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సింహాచలం నాయుడు మాట్లాడుతూ మనం ఇంత స్వేచ్ఛ గా బ్రతుకుతున్నాం అంటే, చదువుకుంటున్నామంటే, మాట్లాడుతున్నామంటే అన్నింటికీ మూలం మన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనమే అని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. రవికుమార్ , ఆదినారాయణ,భూమా రెడ్డి,భాస్కరరావు, విద్యార్థులు,తల్లిదండ్రులు,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App