జూన్ 27, 2026

IMG 20240509 WA0010

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ – కుత్బుల్లాపూర్
బిల్డర్ నిర్లక్ష్యం మెరసి యజమాని పర్యవేక్షణ లోపం వల్ల గోడ కూలి 7మంది కూలీలు మృతి చెందిన సంఘటన బాచ్ పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. గత రాత్రి గాలీ వాన భీభ్సవం సృష్టించడం తో పాటు, మరో ప్రక్క బాచుపల్లి పరిధిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో  రైట్ డెవలఫర్ బిల్డర్ నిర్లక్ష్యం మూలంగా ఎడుమంది కూలీలు మృత్యువాత పడగా, నల్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒరిస్సా రాష్టానికి చెందిన తిరుపతి (20) శంకర్ (20) రాజ్ (25) ఖుషీ (28) రామ్ యాదవ్, హిమాన్లుతో పాటు, నల్గురు కార్మికులు గాయపడగా, స్థానికంగా, మమత హాస్పిటల్ లో చికిత్స పోందుతున్నారు.  క్షతగాత్రులను గాంధీ హస్పటల్ కు తరలించారు. కార్మికుల మృతిచెందిన ప్రాంతాన్ని కూకట్ పల్లి ఏసీపి, బాచ్ పల్లి సిఐ సీబ్బంది తో సంఘటనకు సంబంధించి వివరాలను సేకరించారు. సంభఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కేసును బాచుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

You cannot copy content of this page