TRINETHRAM NEWS

5వ జిల్లా  సహకారం అభివృద్ధి కమిటీ సమావేశం

జిల్లాలోని సహకార రంగం బలోపేతం దిశగా కృషి చేయాలి

రానున్న సమావేశానికి శాఖల వారీగా కార్యాచరణ కార్యకలాపాలు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి.

రాజమహేంద్రవరం : జిల్లాలో సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు సంబంధిత శాఖల వారి అధికారులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ తో రానున్న సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పీ. ప్రశాంతి ఆదేశించారు.

మంగళవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో 19 శాఖల అధికారులతో 5వ తూర్పు గోదావరి జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఏలూరు, కాకినాడ, డిసిసిబి సీఈ ఓ లు / జిల్లా పరిషత్ సిఈఓ లు, కమిటి మెంబెర్స్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ సహకార సంఘాల2025 -26 ఏడాది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ గా ప్రకటించడం జరిగిందన్నారు. ఆ క్రమంలో ఆర్ధిక బలోపేతం దిశగా విజన్ 2047 ను అనుసరించి అనుకూలత కలిగిన కార్యకలాపాలపై ప్రతిపాదన చేయాల్సి ఉందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పరచడానికి రుణాలు మంజూరు చేయడం ద్వారా కౌలు రైతులకు, పాడి పరిశ్రమ రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు అమలు చేస్తున్న పథకాల పురోగతి, జిల్లా యంత్రాంగం తరపున చేపట్టిన కార్యక్రమం వివరాల నివేదిక అందచేయాలని పేర్కొన్నారు.

కోఆపరేటివ్ కమీషనర్ మరియు రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా జిల్లాలో లక్ష్య కార్యక్రమాల అమలు కోసం వార్షిక ప్రణాళికను సిద్ధం చెయ్యాలన్నారు. జనవరి నెలలో వార్షిక ప్రణాళిక పై చర్చ, ఫిబ్రవరిలో డిజిటలై జేషన్ కౌలు రైతులకు రుణాలు , మార్చిలో స్టూడెంట్స్ అవగాహన కార్యక్రమాలు, ఏప్రిల్ నెలలో హెల్త్ క్యాంపు ఏర్పాటు , డ్వాక్రా సంఘాలతో, మే నెలలో ప్యాక్స్ సొసైటీ శిక్షణ కార్యక్రమం , జూన్ నెల లో చేనేత సహకార సంఘాలకు , జూలైలో మత్స్య సహకార సంఘాలకు కార్యశాల , ఆగస్ట్ నెలలో జిల్లా కోపరేటివ్ సహకార బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక చేకూర్పు , సెప్టెంబరు లో యువతకు అవగాహన కార్యక్రమాలు , అక్టోబర్ నెలలో డి సి ఎం ఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యశాల , నవంబర్ నెలలో సర్వీస్ ప్రొవైడర్ బ్యాంకింగ్, క్రెడిట్ సొసైటీ సెమినార్ , డిసెంబరు నెలలో డిసిసిబి ఆధ్వర్యంలో సహకార సంఘాలు కు కార్యశాల నిర్వహించనున్నట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తూ ఫలవంతమైన చర్యలు చేపట్టాలని అందుకు మండలానికి ఒక మోడల్ సహకారం సంస్థను పరిగణం లోనికి తీసుకోవాలన్నారు. వ్యవసాయం, పశుపోశకుల కౌలుదారులకు డిసిసిబి ద్వారా రుణాలు నూరు శాతం అందించాలన్నారు. జిల్లాలోని అన్ని సొసైటీస్ లో అక్కడ అమలు చేస్తున్న కార్యక్రలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వాటికి సంబంధించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. సహకారం రంగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్స్, జనఔషది ప్రతినెల పర్యవేక్షణ వుండాలన్నారు.యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ కు సంబంధించి లక్ష్య సాధాన దిశగా సంబంధిత శాఖలా సమానవ్యంతో ఆయా పథకాలకు సంబంధించి ముందుకెళ్ళాలన్నారు.

ఈ సమావేశంలో 19 శాఖలకు చెందిన అధికారులు జిల్లా కోపరేటివ్ అధికారి ఎం. జగన్నాదరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, పశుసమర్ధక శాఖ అధికారి కే. శ్రీనివాసరావు, ఏలూరు జడ్పీ సీఈవో సుబ్బారావు, కాకినాడ జడ్పీ డిప్యూటీ సీఈవో రాంగోపాల్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App