59 students appeared for the 10th class physical chemistry supplementary examination DEO D. Madhavi
పెద్దపల్లి,జూన్ -08 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ భౌతిక రసాయన శాస్త్రం పరీక్షకు 59 మంది హాజరయ్యారని జిల్లా విద్యా శాఖ అధికారి డి.మాధవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా సెంటర్ లో శనివారం నిర్వహించిన పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ భౌతిక రసాయన శాస్త్రం పరీక్షకు 79 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 59 మంది విద్యార్థులు హాజరు అయినట్లు తెలిపారు. డి.ఈ.ఓ, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమీషనర్ పరీక్షా సెంటర్ ను పర్యవేక్షించడం జరిగిందని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదని, పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు డి.ఈ.ఓ. మాధవి ఆ ప్రకటనలో తెలిపారు
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App