TRINETHRAM NEWS

ఏపిలో కొత్తగా 53 కళాశాలలు .. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Trinethram News : Andhra Pradesh : 37 మండలాల్లో 47, 2 పట్టణ ప్రాంతాల్లో ఆరు ప్రైవేటు కళాశాలల ఏర్పాటుకు ఆమోదం

ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్

ప్రైవేటు కళాశాలలకు ప్రతిపాదనలు పంపిన ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా

ఏపీలో కొత్తగా 53 జూనియర్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 37 మండలాలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

37 మండలాల్లో 47 కళాశాలలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ఆరు కళాశాలలు ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App