Trinethram News : చెన్నై:జనవరి 16
తమిళనాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించిన జల్లికట్టు క్రీడలో మంగళ వారం అపశృతి చేటు చేసుకుంది.
పోలీసులతో సహా 45 మందికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో గాయపడిన వారిని మధురైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అవనీయ పురం జల్లికట్టు కార్యక్ర మంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జల్లికట్టులో ఎద్దులు అదుపు చేసేందుకు ప్రయత్నించిన యువ కులను అవి కుమ్మి వేశాయి.. అంతకాకుండా బరిలోంచి బయటకు రంకెలేస్తూ దూకి ప్రేక్షకుల మీద నుంచి దూకిపారి పోయాయి.. దీంతో ఇద్దర పోలీసులతో సహా 45 మందికి పైగా గాయపడ్డారు.
ఇది ఇలా ఉంటే అవనీయపురంలో నిర్వహించిన జల్లికట్టు కోసం వెయ్యి ఎద్దులు, 600 మంది యువకులు పాల్గొన్నారు. ఈ పోటీ ప్రాంగణం దగ్గర 8వందల మంది పోలీసులు బదోబస్తు నిర్వహించారు.
వైద్య సేవలు అందించడా నికి 20 మెడికల్ టీమ్ లను సిద్దంగా ఉంచారు. మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. తొలి రోజు ప్రమాదాలు జరగడంతో ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటు న్నారు…