కస్టమర్స్ పై ఐదేళ్లలో బ్యాంక్ ల బాదుడు అక్షరాల 35 వేల కోట్లు
గడిచిన ఐదేళ్లలో వివిధ చార్జీల రూపంలో ఖాతాదారుల నుంచి బ్యాంకులు వసూలు చేసిన మొత్తం విలువ తెలిస్తే అందరి కళ్ళు బైర్లు కమ్ముతాయి.2018 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ మరియు ప్రైవేటు, కమర్షియల్ బ్యాంకులు వివిధ చార్జీల రూపంలో ఏకంగా 35,587 కోట్లు వసూలు చేశాయంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది అక్షరాల నిజం.
మీరు ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ హోల్డర్ అయితే మీ దగ్గర నుంచి కూడా బ్యాంకులు సొమ్మును కాజేసారు.
సేవింగ్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేదని 21,044.04 కోట్లు, పరిమితి దాటిన ఏటీఎం లావాదేవీలపై 8289.32 కోట్లు , ఎస్ఎంఎస్ చార్జిలంటూ 6254.32 కోట్లు రూపాయలు మొత్తం కలిపి 35,587.68 కోట్ల రూపాయలు బ్యాంకులు చార్జీలు కింద మన నుంచి వసూలు చేశాయి. ఎస్బిఐ, పీఎన్ బీ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు, యాక్సిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ వంటి ప్రైవేటు రంగ బ్యాంకులు గడిచిన ఐదేళ్లలో అడ్డంగా వివిధ చార్జీలు అంటూ కస్టమర్లపై వసూలు చేసిన మొత్తం ఇది. ఈ లెక్కలు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు.