
Trinethram News : గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి చెందిన విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఫిరోజాబాద్ నగరంలోని హన్స్‌వాహిని పాఠశాలలో శనివారం మధ్యాహ్నభోజన సమయంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో చంద్రకాంత్(8) అనే బాలుడు గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
