TRINETHRAM NEWS

ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 3 :ఫిబ్రవరి నెల్లూరు జిల్లా: కావలి. ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చునని,నెల్లూరు జిల్లా,కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు, కావలి పట్టణం వాయునందన ప్రెస్ రోడ్ లో ఐ.ఏఎ.స్, ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 20వ వార్షికోత్సవ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి , పాల్గొన్నారు,ఈ సందర్బంగా ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ని, కళాశాల డైరెక్టర్. వెంకటేశ్వర్లురెడ్డి శాలువాలు కప్పి పుష్పగుచ్చములతోటి సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు,అనంతరం ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు,ప్రతి విద్యార్థి కూడా తమ తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి ఒక లక్ష్యంతో కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునన్నారు. మీరు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే మీ తల్లిదండ్రులు గురువులు సంతోషం వ్యక్తం చేస్తారన్నారు.రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అన్ని విధాల టెక్నాలజీ తో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు..

తాను కూడా ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని నేలపై కూర్చొని తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి ఇష్టం తో చదివాను కాబట్టి,కావలి ఎమ్మెల్యేగా ప్రజా సేవలో ముందుకెళ్తున్నాను , విద్యార్థులు సాంకేతికపరంగా మంచి విజ్ఞానాన్ని సంపాదించుకొని దేశాన్ని సాంకేతిక రంగంలో ముందు వరుసలో నిలిపి ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి అని ప్రతి విద్యార్థి జీవితంలో ఒక మంచి మిత్రుని ఎన్నుకోవాలని,చీకట్లోనే కాంతిని,నష్టాల్లోనే లాభాన్ని కష్టాల్లోనే సుఖాన్ని అవమానాల్లోనే సన్మానాన్ని,ఓటమిలోనే గెలుపుని సాధించాలి రాబోవు రోజుల్లో కావలి నియోజక వర్గానికి అనేక భారీ పరిశ్రమలను తీసుకొని వచ్చి కావలి ని ఆంధ్రప్రదేలో ప్రముఖ పారి శ్రామిక వాడగ తీర్చిదిద్దుతానని చెప్పాడు,ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్,అధ్యాపకులు,విద్యార్థులు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

IAA's English Medium High School