TRINETHRAM NEWS

Trinethram News : వాక్ స్వాతంత్ర్యము, భావ ప్రకటనా స్వాతంత్ర్యము ద్వారా, రాతల ద్వారా వాక్ స్వాతంత్ర్యము, భావ ప్రకటనా స్వాతంత్ర్యము అనగా, పౌరుడు నోటి మాటల ద్వారా, ముద్రణ ద్వారా బొమ్మలు ప్రదర్శించుట లేదా ఇతర పద్ధతుల ద్వారా తన మనో భావాలను, స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కు అని అర్ధము.

ఈ హక్కులను, రాజ్యాంగములో 19(1) (ఎ) వ ఆర్టికలు వ్యక్తులకు ప్రసాదిస్తున్నది.

అయితే, ఈ రాజ్యాంగమే, 19(2) వ ఆర్థికల ద్వారా ఈ హక్కుల పై కొన్ని పరిమితులను / ఆంక్షలను / నిర్బంధాలను విధిస్తున్నది.

ఈ హక్కులకు భౌగోళిక హద్దులంటూ ఏవి లేవు. ఈ హక్కులను భారతదేశంలో మాత్రమే కాకుండా, దేశం వెలువల కూడ వినియోగించవచ్చును.