
త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట మండలం. బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పించారు. అశ్వారావుపేట మండలంలో SC సబ్ ప్లాన్ నిధులు ఒకకోటి ఎనభై రెండు లక్షల యాభైవేల రూపాయల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చేతుల మీదుగా అచ్యుతాపురం SC కాలనీ మరియు నారంవారిగూడెం SC కాలనీలలో నలభై లక్షలతో మంజూరైన సీ.సీ రోడ్లకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
త్వరలోనే నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామానికి అందిస్తామని పేర్కొన్నారు. ఆయా గ్రామాలలో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి తన ద్వారా మెరుగైన వైద్యం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డీఈ శ్రీధర్, ఏ ఈ అక్షిత, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల స్పెషల్ అధికారి ప్రదీప్ కుమార్, పంచాయతీరాజ్ మండలాధికారి సోయం ప్రసాద్, మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు, జూపల్లి రమేష్, సుంకవల్లి వీరభద్రరావు, జూపల్లి ప్రమోద్, మిండా హరి, వేల్పుల సత్యనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షులు కొల్లు చంద్రశేఖర్, వేముల నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు దారబోయిన వెంకటమ్మ, రమేష్, ఇనుగంటి హరిబాబు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
