
ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 9 : అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకులోయ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అరకులోయలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో సోమవారం నిర్వహించిన మెగా యోగాసనాల కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా జరిగింది. ఐదు మండలాలకు చెందిన పాఠశాలల నుంచి వచ్చిన 20,581 మంది గిరిజన విద్యార్థిని, విద్యార్థులు ఒకే వేదికపై 108 నిమిషాలలో 108 సూర్య నమస్కారాలు చేయడం విశేషం.
సాయంత్రం 4:45 గంటలకు ప్రారంభమైన ఈ సూర్య వందన కార్యక్రమం, పెద్ద ఎత్తున నిర్వహించబడింది. విద్యార్థులతో పాటు పీఈటీలు, పీడీలు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పోలీసుల బందోబస్తు మధ్య విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ యోగాసనాల ప్రదర్శనను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించగా, పతాంజలి యోగా గురువు శ్రీనివాసు విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. సూర్య నమస్కారాల ప్రదర్శన నైపుణ్యంగా నిర్వహించబడగా, ఇది అరకులోయలో మొట్టమొదటిసారిగా చేసిన ఘన కార్యక్రమంగా నిలిచింది.
ఈ విశిష్ట కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కి నమోదు చేయడానికి ప్రత్యేకంగా ప్రతినిధిగా వచ్చిన ఏలేసా రైడన్ ఈ యోగాసన ప్రదర్శనను తిలకించి, రికార్డు నమోదు ప్రక్రియ ప్రారంభించారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి అభిషేక్ గౌడ్, పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, జిల్లాఎస్పీ అమిత్ బర్గర్, ఉన్నత అధికారులు గిరిజన ప్రజా పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సమక్షంలో చూసి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ మెగా యోగాసన కార్యక్రమం విద్యార్థుల్లో ఆరోగ్యంపై అవగాహన కలిగించడమే కాకుండా, ప్రాచీన భారతీయ యోగ పద్ధతులను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఒక పెద్ద ముందడుగుగా నిలిచింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
