
1000 liters of ready made jaggery drink destroyed by Gudumba in Begumpet suburb
18 లీటర్లు గుడుంబా స్వాధీనం రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కమీషనరేట్ పెద్దపల్లి జోన్ రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట్ గ్రామం కంచర చెరువు ప్రాంతం లో గుడుంబా తయారు చేస్తున్నారు అనే పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారుల ఆదేశాల ప్రకారం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఏలియా, మహేందర్, కానిస్టేబుల్స్ చంద్రశేఖర్, సునీల్, రాజేందర్ లు వెళ్లి తనిఖీ చేయగా అక్కడ సుమారు 1000 లీటర్లు గుడుంబా తయారీకి సిద్ధం గా ఉన్న బెల్లం పానకం గుర్తించడం జరిగింది. అదేవిధంగా 18 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గుడుంబా తయారీ చేస్తున్న నిందితుడు బొంతల రమేష్ s/o రాజయ్య,40yrs, బేగంపేట్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ని చూసి పారిపోవడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్న 18 లీటర్ల గుడుంబాను రామగిరి పోలీస్ వారికి అప్పగించడం జరిగింది
1000 లీటర్లు గుడుంబా తయారీకి సిద్ధం గా ఉన్న బెల్లం పానకం ధ్వంసం చేయడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
