TRINETHRAM NEWS

అనపర్తి : త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నీయోజకవర్గం
రామవరం: గ్రామంలోని కీలక నేతలంతా వైసిపిని వీడి టిడిపిలోకి చేరిక,
ప్రజాకర్షణ కలిగిన నేతల చూపు కూటమి వైపు,
ఎమ్మెల్యే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు మనోజ్ ల నాయకత్వం పట్ల ఆకర్షితులౌతున్న వైయస్సార్ సిపి నేతలు,

మాజీ ఎమ్మెల్యే డా సత్తి సూర్యనారాయణరెడ్డి, వాయకత్వం పట్ల నమ్మకం కోల్పోతున్న నియోజకవర్గ శ్రేణులు,

నేడు రామవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రామవరం గ్రామానికి చెందిన వైయస్సార్ సిపి నాయకులు ఎంపీటీసీ, లు గొలుగూరి గౌతమి వెంకటరెడ్డి, నల్లమిల్లి భాగ్యలక్ష్మి, మాజీ ఎంపీటీసీ గొలుగూరి గోవింద రెడ్డి, మాజీ సర్పంచ్ గొలుగూరి భూలక్ష్మి, వార్డ్ మెంబర్స్ నల్లమిల్లి వరలక్ష్మి, జుత్తుక సత్యవేణి మరియు 36 కుటుంబాలు వైయస్సార్సీపీ పార్టీ నుండి టిడిపి లోకి జాయిన్ కావడం జరిగింది.

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు, అనపర్తి,బిక్కవోలు, పెదపూడి, రంగంపేట మండలాల ఎన్ డి ఏ నాయకులు,రామవరం గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YSRCP party is getting washed out