యువత “స్వామి వివేకానంద” మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
ఈరోజు 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ నందు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “రక్తదాన మరియు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని” కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, కార్పొరేటర్ బి. విజయ శేఖర్ గౌడ్ తో కలిసి హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. దేశ యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి అని, వారి సూచించిన మార్గంలో పయనిస్తూ యువత బంగారు భవిష్యత్తును రూపొందించుకోవాలన్నారు. అనంతరం గాంధీనగర్ కాలనీ వ్యవస్థాపక అధ్యక్షులు జల్దా రాఘవులు ని వారి నివాసంలో కలిసిన ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, నాయకులు బాలు నేత, మాధవ రెడ్డి, ఆనంద్, సందీప్, సాయి, శ్రీకాంత్, రామచందర్, సతీష్ గట్టోజి, ఎర్వ సాయి కిరణ్ (బంటి), యాదవ రెడ్డి, గౌసుద్దిన్, స్వామి వివేకానంద యూత్ అధ్యక్షులు జల్దా లక్ష్మీనాథ్, సెక్రటరీ ఎల్లయ్య, అసోసియేషన్ సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాస్, తిమ్మయ్య, నవీన్, వెంకట సాయి, వెంకటరమణ, అల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App