
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం సుందరయ్య నగర్ గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ గోలి రమణ W/o ప్రేమ్ కుమార్ కుమారుడు అయిన గోలి సందీప్ కుమార్ గత సంవత్సరం అనగా 2024 డిసెంబర్ 22వ తేదీన రాసిన AIBE – 2024 ALL INDIA BAR EXAMINATIONS లో 62% పర్సంటేజ్ తో ఉత్తీర్ణత సాధించడం జరిగింది. 1,44,014 మంది యావత్తు దేశంలో ఈ యొక్క పరీక్ష రాయగ 69,646 మాత్రమే ఉత్తీర్ణత సాధించారని ఈ సందర్భంగా తెలియపరిచారు.
ఎటువంటి కోచింగ్ లేకుండా ఫస్ట్ అటెంప్ట్ లోనే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్స్ పరీక్షను విజయవంతంగా రాసి ఉత్తీర్ణత సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అలాగే పలువురు రాజకీయ నాయకులు పెద్దలు మరియు మిత్రులు యువ న్యాయవాది సందీప్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియపరిచారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి న్యాయవాది సందీప్ కుమార్ చేరుకోవాలని ఆకాంక్షించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
