TRINETHRAM NEWS

అందరికీ నమస్కరిస్తూ మీ మనోజ్ తెలియజేయునది…

Trinethram News : మా తాతగారైన నల్లమిల్లి మూలారెడ్డి కుటుంబానికి రాజకీయంగా, వర్గ వర్ణాల కు అతీతంగా అండగా నిలుస్తూ మీ అందరికీ సేవలందించే భాగ్యాన్ని మా కుటుంబానికి కల్పిస్తూ తాత గారి వద్ద నుంచి నా తండ్రిగారైన రామకృష్ణారెడ్డి వరకూ మీరు చూపిస్తున్న అభిమానం, ప్రోత్సాహం, చొరవ ఎప్పటికీ మరిచిపోలేము.

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్ విషయంలో ఏర్పడిన సందిగ్ధత సమయంలో మా కుటుంబాన్ని మీరు అక్కున చేర్చుకుని ఆదరించిన తీరు ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని రుణం. మా కుటుంబాన్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని వెన్ను తట్టి ముందుకు నడుపుతూ మా అభివృద్ధిని కాంక్షించే మీరు నా వివాహానికి సంబంధించి దాదాపు నెల రోజులు నుండి జరిగిన పెండ్లికొడుకు, వీరభద్రుడి బోనం, హైదరాబాదులో వివాహం, 23 వ తేదీన ఆదివారం అనపర్తి లో జరిగిన గ్రాండ్ రిసెప్షన్ కు సంబంధించి మీరు అందించిన సహాయ సహకారాలు మరువలేనివి. రిసెప్షన్ ను సక్సెస్ చేయడానికి నన్ను అభిమానించే క్యాడర్ అంతా నిద్రలేని రాత్రులు గడిపి అవిశ్రాంతంగా పథక రచనలు చేసి ఫలప్రదం చేయడంలో మీరంతా భాగస్వాములు కావడం చాలా ఆనందంగానూ, గర్వంగానే ఉంది.

రిసెప్షన్ విజయవంతం చేయడంలో పనిచేసిన, సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ, కూటమి నేతలకు, కార్యకర్తలకు నా కుటుంబం రుణపడి ఉంటుంది. ఇకపై కూడా నాపైన, నా కుటుంబం పైన యధావిధి గానే మీ అభిమానం, ఆశీస్సులు కొనసాగాలని కోరుకుంటూ…

మీ

మనోజ్ రెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nallamilli Moolareddy