TRINETHRAM NEWS

తేదీ : 19/01/2025.
సి.పి.ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో.

కుక్కునూరు మండలం : (త్రినేత్రం న్యూస్) ; విలేఖరి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండల మెయిన్ రోడ్డు నిర్మాణం మధ్యలో అర్థ రంతంగా ఆగిపోవడం జరిగింది. దాదాపు 40 కిలోమీటర్ల వరకురోడ్డు పనులు జరగవలసి ఉంది.
వాహనదారులు, ప్రజలు రోడ్డుపై నడవాలన్నా, ప్రయాణం చేసిన దుమ్ము ధూళి కి ఎదుట వాహనం మరియు మనుషులు కనిపించే పరిస్థితిలో లేదు. ఇలా ఉండడంవల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారులు ఎవరు పట్టించుకోవడంలేదని ఈరోజు సి.పి.ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టడం జరిగింది. తక్షణమే ఉమ్మడి కూటమి ప్రభుత్వం పట్టించుకోని త్వరగా రోడ్డును వెయ్యాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి యం.వెంకట చారి, జిల్లా కమిటీ సభ్యులు కూరాకుల బాబురావు, మండల కార్యవర్గ సభ్యులు మడిపల్లి .రమణయ్య, సోడే నాగు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App