
త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరు మండల కేంద్రంలో ని సామాజిక ఆరోగ్య కేంద్రం నందు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం గా ఉంటేనే మనం ఏదైనా సాధించగలమని అన్నారు. ఉదయం లేచిన వెంటనే శరీరా అవయవాలు ఉత్తేజం పొందటానికి ఒక లీటర్ నీళ్లు త్రాగాలి. అలాగే పని చేసిన తర్వాత అలసినటువంటి సమయంలో నీరు బాగా తాగాలి. భోజనానికి అరగంట ముందు తర్వాత అరగంట నీళ్లు తాగాలి అన్నారు. అలాగే డాక్టర్ సంధ్య మాట్లాడుతూ ఆకుకూరలు పండ్లు పాలు బాగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ నర్స్ నిర్మలాదేవి మరియు ఆరోగ్య సిబ్బంది రోగులు అందరూ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
