TRINETHRAM NEWS

ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ఖనిలో ఏర్పాటు చేసే విధంగా కృషి చేయండి

ఖనిలో జవహర్ నవోదయ (జె ఎన్ వి) విద్యాలయం ఏర్పాటు చేయాలి

పారిశ్రామిక ప్రాంతంలో ఏసీ అస్పత్రి నిర్మించాలి, సింగరేణి కార్మికులకు ఐటి మినహాయింపు రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంపుదల కై పోరాడండి

పెద్దపల్లి ఎంపి వంశీ పలు సమస్యలు పరిష్కరించాలని కోరిన మద్దెల దినేష్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి ఎంపి యువ నేత గడ్డం వంశీ మంగళవారం గోదావరిఖని జవహర్ లాల్ నెహురు స్టేడియంకు మార్నింగ్ వాక్ విచ్చేసిన సందర్బంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఎంపి వంశీ కలిసి పలు ప్రధాన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారని వారు తెలిపారు. అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతు గోదావరిఖని ప్రాంతంలో ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం రాపో ఏర్పాటు చేయాలన్నారు.
ఎంతోమంది ఉన్నత విద్యానభ్యసించనీకి మరియు ఉద్యోగ-ఉపాధి అవకాశాలకు అలాగే వ్యాపార రీత్య ఇతర దేశాలతో పాటు, గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారని, అయితే పాస్ పోర్ట్ కొరకు హైద్రాబాద్, కరింనగర్, నిజమాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళవల్సి వస్తుందన్నారు.
అలాగే విద్యార్థిని, విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దే దేవాలయం జవహర్ నవోదయ విద్యాలయం (జె ఎన్ వి) రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేయాలని మా వంతుగా అనేక ఏళ్ల నుండి పోరాడుతున్నామని వారి దృష్టికి తీసుకెళ్లారు.
అదే విధంగా అసంఘటిత కార్మికుల సౌకర్యార్ధం కొరకు ఖనిలో ఏసీ హాస్పిటల్ కు నిధులు మంజూరైన గత పాలకుల నిర్లక్ష్యంతో నిర్మాణం పనులు చేయక పోవడంతో జాప్యం జరుగుతుందని, కావున మీరైనా ఏసీ అస్పత్రి నిర్మాణం పనులు వెంటనే మొదలయ్యే విధంగా సంబందించిన రీజినల్ ఏసీ అధికారులతో మాట్లాడి అస్పత్రి పనులు జరిగే విదంగా చర్యలు తీసుకువాలని కిరమన్నారు.
రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ లో 80%, స్థానిక నీరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని కోరామని తెలిపారు. అహర్నిశలు కష్టపడి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశానికి వెలుగులనిచ్చే సింగరేణి కార్మికుల పనిచేస్తుంటే వారి నుండి ఐటి మినహాయించాలని మరియు రిటైర్డ్ సింగరేణి కార్మికుల పేన్షన్ పెంపుదల కోసం పార్లమెంట్ లో ప్రశ్నించి పోరాడాలని పెద్దపల్లి ఎంపి వంశీ మార్నింగ్ వాక్ లో కలిసి పై విషయాలతో పాటు ప్రజలు ఎదురుకుంటున్న సమస్యల పట్ల వారికి వివరించడం జరిగిందని, వారు కూడా సానుకూలంగా స్పందించరని మద్దెల దినేష్ పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App