Women’s societies should pay their loans on time
ఆదాయ సృష్టి పై ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష
*మహిళా సంఘాలు తమ రుణాలను సకాలంలో చెల్లించాలి
*మహిళా సమాఖ్య కార్యాలయం అవసరమైన మౌలిక వసతుల ప్రతిపాదనలు సమర్పించాలి
*జిల్లా మహిళా సమాఖ్య సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
పెద్దపల్లి అక్టోబర్ -05: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జిల్లాలోని మహిళా సంఘాలు ఆదాయం సృష్టించే కార్యక్రమాల పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపెల్లి ఎంపీడీవో ప్రాంగణంలోనీ జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించిన సమావేశం లో పాల్గోన్నారు .
మహిళా సంఘాలకు అందిస్తున్న స్వశక్తి రుణాలు, రుణాల రికవరీ, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలు, మహిళా సంఘాలకు ఉన్న సమస్యలు మొదలగు అంశాలను కలెక్టర్ ఆరా తీశారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, జిల్లాలోని మహిళా సంఘాలు వారికి అందించిన స్వశక్తి బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీ నిధి రుణాలు సకాలంలో చెల్లింపులు చేయాలని, ఎన్.పి.ఏ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్
సూచించారు.
మహిళా సంఘాలు తమకు అందుతున్న బ్యాంకు లింకేజీ రుణాలను వినియోగించుకుంటూ ఆదాయం సృష్టించే కార్యక్రమాలు అమలు పై శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పెట్రోల్ బంక్, కళ్యాణ మండపం నిర్వహణ మొదలగు వివిధ ఆదాయం సృష్టించే కార్యక్రమాలను మహిళా సంఘాలు చేపట్టడం పై కలెక్టర్ చర్చించి పలు సూచనలు జారీ చేశారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మహిళా సంఘాలకు అందించే బ్యాంకు రుణాలను వినియోగించుకుంటూ వాణిజ్య వ్యాపార రంగాల్లో మహిళలు వృద్ధి సాధించాలని ప్రభుత్వం సంకల్పించి ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం అందించే అవకాశాలను వినియోగించుకుంటూ మహిళలు ఆర్థికంగా స్థిరపడాలని కలెక్టర్ కోరారు.
జిల్లా మహిళా సమాఖ్య సంఘానికి ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. మహిళా సమాఖ్య కార్యాలయానికి అవసరమైన ఫర్నిచర్ ,టాయిలెట్స్ మరమ్మత్తులు ,నూతన టాయిలెట్ నిర్మాణం మొదలగు ప్రతిపాదనలు అందించాలని వాటిని వెంటనే మంజూరు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సరస్వతి, కార్యదర్శి కోమల, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App