
అన్నమయ్య జిల్లా పీలేరులో విషాద ఘటన చోటుచేసుకుంది.
రైలు కిందపడి 22 ఏళ్ల మహిళ మృతి చెందింది.
Woman Dies : అన్నమయ్య జిల్లా : పీలేరు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆకులవారిపల్లెకు చెందిన డేరంగుల శివకుమార్ భార్య డేరంగుల అంజమ్మ (22) మృతి చెందినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ప్రకారం.. మంగళవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో అంజమ్మ మద్యం సేవించి ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడిన అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో రైల్వే ట్రాక్‌పైకి వెళ్లిన ఆమె.. ట్రాక్ మరమ్మతుల కోసం వెళ్తున్న రైలు ఇంజిన్ కింద పడి మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనపై లోకో పైలట్ ఇచ్చిన సమాచారంతో కదిరి నుంచి రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. అంజమ్మ మృతికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe