TRINETHRAM NEWS

Trinethram News : శ్రీకాకుళం జిల్లాలో క్రిప్టో కరెన్సీ తరహా ఆన్లైన్ యాప్ లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెప్పి సైబర్ నేరగాళ్లు 17.5 లక్షల రూపాయలు టోకరా వేశారు.

శ్రీకాకుళం లో ఫాజుల్ భాగ్ పేట కు చెందిన గ్రీష్మిత అనే సాప్ట్ వేర్ ఉద్యోగిని వర్క్ ఫ్రమ్ హోమ్ కావటంతో భర్త జగదీష్ తో కలసి నగరంలోనే వుంటుంది.

లాభాలకు ఆశపడి సైబర్ నేరగాళ్ల మాయలో పడి నష్టపోయింది.

దీనిపై శ్రీకాకుళం 3వ పట్టణ సీఐ ఉమా మహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.