TRINETHRAM NEWS

Trinethram News : హన్మకొండ జిల్లా :మార్చి01
జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరకాల ఘటనలో గాయ పడిన పార్టీ కార్యకర్తలను.. ఇవాళ చలో మేడిగడ్డకు వెళ్తుండగా మార్గమధ్యలో కలిసి పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు దారుణంగా వ్యవహరించ డంపై ఆయన మండిప డ్డారు.

వెంటనే జిల్లా ఎస్పీ అంబర్షా తో ఫోన్ లో మాట్లాడారు కేటీఆర్‌. కొంతమంది స్థానిక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నా రని తప్పుబట్టారు. కార్యక ర్తలను పోలీసు స్టేషన్లకు పిలిపించి వేధిస్తే.. బీఆర్ ఎస్ పార్టీ చూస్తూ ఊరుకో బోదని స్పష్టంచేశారు. కేటీఆర్.

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. పోలీసులు చట్టబ ద్ధంగా వ్యవహరించాలని సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, ఉద్యమంలో ఇలాంటి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ పార్టీ మనదని గుర్తుచేశారు….