TRINETHRAM NEWS

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాట్లకు సంబంధించిన డీపీఆర్ 2019 సెప్టెంబ‌ర్‌లో రైల్వే బోర్డుకు అంద‌జేశారు. ఇది ఆమోదం కూడా పొందింది. కానీ ఇప్పటివరకు రైల్వేజోన్ పనులకు సంబంధించి ఒక్క అడుగు ముందుకు పడలేదు.

రైల్వే జోన్ కోసం కేంద్రం కోరిన భూములు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అంటుంటే, ఆ భూములు వివాదంలో ఉన్నాయని కేంద్రం చెబుతోంది.

అయితే, ఏపీ ఇస్తామని అంటున్న భూమిని కేంద్రం ఎందుకు తీసుకోవడం లేదు? ఆ భూములు కాకుండా మరో చోట రాష్ట్రం ఇవ్వలేదా? ఆ భూముల్లోనే రైల్వే జోన్ పనులు ప్రారంభించాలా? ఆ భూముల చుట్టూ ఉన్న వివాదం ఏంటి?