
అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం అనంతగిరి ఏప్రిల్ 4: అనంతగిరి మండలం లో పార్టీ అధిష్ఠానం చే నియమించిన మండల అధ్యక్షులు చిట్టం మురళి మాట్లాడుతూ మేము గత ఐదు సంవత్సరాలుగా పార్టీ నిర్మాణానికి ,బలోపేతానికి కృషి చేస్తున్నాము ఇది ఏ ఒక్కరి వల్ల కాలేదు పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడిన మండల కమిటీ నాయకులు,వీర మహిళలు, జనసైనికులు ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి నేటికీ అధినేత ఆశయాల సాధనకు,సిద్ధాంతాలకు,పార్టీ రాజకీయ వ్యూహాత్మ ప్రణాళికలను అణుచరించి మేమంతా ఒక కుటుంబం లా కలిసి ప్రయాణం చేస్తున్నాము.ఇటీవలే దొర బాబు అనే ఒక కొత్త వ్యక్తి వచ్చి జనసేనపార్టీ లో చేరికలు చేయిస్తున్నారు.
అతను పార్టీలో ఎప్పుడు చేరారు,క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారా?లేదా మండల కమిటి నాయకులు, జనసైనికులతో అతనికి ఉన్న పరిచయాలు ఏమిటని మా అధినేత ఆశయాలు,సిద్ధాంతాలకు లోబడి పని చేస్తున్నారా?లేకుంటే అతనికి ఏమైనా వ్యక్తిగత ఎజెండా ఉందా?? పూర్తి స్థాయి లో మా పార్టీ ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం లేదు..ఒక వేళ నిజంగానే అభిమాని, జనసైనికుడు అయ్యుంటే మండల అధ్యక్షులకు,కమిటి నాయకులకు తెలియజేసి కార్యక్రమాలు చెయ్యొచ్చు.. తప్పులేదు కాని మా సిద్ధాంతాలకు విరుద్దబావలు కలిగిన ప్రతిపక్ష పార్టీల నుంచి కుట్రలు చేస్తున్నారనేది మా సందేహం దొరబాబు.
మీరు ధైర్యంగా మా ముందుకు రండి మీ ఆలోచన విధానం తెలపండి కార్యక్రమాలు చేయండి కానీ కుట్రలు చేసే ఆలోచనలు చేస్తే మాత్రం సహించేది లేదు చాలా తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందనీ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
